Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్ధిని మృతి
పాలిటెక్నిక్ విద్యార్ధులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒక విద్యార్ధిని మరణించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Prakasam Dist Road Accident
Road Accident : పాలిటెక్నిక్ విద్యార్ధులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒక విద్యార్ధిని మరణించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని కంభాలపాడు బెల్లంకొండ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్ధులు ఫీల్డ్ వర్క్ కోసం పక్క గ్రామమైన చిన్నారికట్ల గ్రామ నర్సరీకి శుక్రవారం వెళ్ళారు.
నర్సరీలో ఫీల్డ్ వర్క్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విద్యార్ధులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలి ఊడిపోవటంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈఘటనలో ఒకవిద్యార్ధిని మరణించింది. మరో 17మందికి గాయాలయ్యాయి.
Also Read : TS Covid Update : తెలంగాణలో కొత్తగా 181 కోవిడ్ కేసులు
గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలై పరిస్ధితి విషమంగా ఉన్న ఆరుగురిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. పొదిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.