నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

Tammineni Veerabhadram Health Bulletin

Tammineni Veerabhadram : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయని తెలిపారు. లంగ్స్‌లో నీరుని తొలగిస్తున్నామన్నారు. మెడిసిన్స్‌కి తమ్మినేని స్పందింస్తున్నారు. 50 శాతానికి పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు.

కాగా, ఖమ్మంలో తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. తమ్మినేనికి ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా శాస్వ తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం డాక్టర్లు తెలిపారు.

దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Also Read : బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌‍గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?

తమ్మినేని వీరభద్రంను వెంటిలెటర్ సపోర్ట్ తో ఖమ్మం నుంచి ఏఐజీ హాస్పిటల్ కు తరలించినట్లు డాక్టర్లు తెలిపారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు. మందులతో చికిత్స అందిస్తున్నామని, రక్తపోటు మెరుగుపడుతుందని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తమ్మినేని వీరభద్రం పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

నిన్న సాయంత్రం 4 గంటలకు తమ్మినేనిని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని, అత్యవసర చికిత్స అందిస్తున్నామని నిన్న హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అంచనా వేయలేము అన్నారు. గడిచిన కొన్ని రోజులుగా తమ్మినేని వీరభద్రం శ్వాసకోశ, లంగ్స్ ఇన్ ఫెక్షన్ తో ఇబ్బందులు పడుతున్నారు.

సోమవారం రాత్రి ఆయనను ఖమ్మంలోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లు చెప్పడంతో నిన్న సాయంత్రం 4గంటలకు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Also Read : ఆ 3 ఎంపీ సీట్లపైనే 3 ప్రధాన పార్టీల గురి.. ఆ మూడు ఏవి అంటే..