Amazon
Amazon Expands : హైదరాబాద్ సరిహద్దు శివారు ప్రాంతమైన సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలో అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ లను విస్తరణ చేపడుతోంది అమెజాన్. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ కు అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తం నాలుగు లక్షల చదరపు అడుగలతో స్టోరేజీ కెపాసిటీని పెంచింది.
Read More : Cheran : షూటింగ్‌లో ప్రమాదం.. పాపులర్ యాక్టర్ తలకు 8 కుట్లు..
ప్రస్తుత విస్తరణతో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఓవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగనుంది. తాజాగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఐదు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ లు కలిగినట్లైంది. రాష్ట్రంలో మొత్తం నిల్వ సామర్థ్యం 5మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది.
Read More : Telangana EC : ఓటర్ల జాబితా సవరణ, షెడ్యూల్ ఇదే
తాజా విస్తరణతో అమెజాన్ తన కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నీచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తుందని అమెజాన్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరగతి వర్గాలు చేపట్టే వ్యారాలకు సాధికారిత వస్తుందని తెలిపారు.