Drug Gang Arrest : హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు

హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

drug gang arrest

Drug Gang Arrest : హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారని రాచకొండ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి హైదరాబాద్ కు దిగుమతి చేసేవారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు సరఫరా చేస్తున్నారని తెలపారు.

Inter-State Gang Arrest :హైదరాబాద్‌లో అక్రమంగా డ్రగ్స్‌ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు

విదేశాలకు చెందిన పలువురితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. వారి నుంచి ఎనిమిది కిలోల ఎపిడ్రిన్ స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.