తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా కేసులు

  • Publish Date - May 20, 2020 / 04:13 PM IST

తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 వలస కూలీలు వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1661కు చేరింది. రాష్ట్రంలో 608 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరక 1013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. 

మొత్తం మైగ్రేన్స్ కు సంబంధించి 89కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వారి సంఖ్య 89గా ఉంది. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 608 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఇద్దరు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 40 కి చేరింది. 

గత 14 రోజులు నుంచి కరోనా కేసులకు సంబంధించి 25 జిల్లాలు కొనసాగుతూ వస్తున్నాయి. మూడు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పాజిటివ్ కేసులు ఉన్నా..వారు మైగ్రేన్స్ కావడం వల్ల ఆ జిల్లాకు సంబంధం లేదు.