Apsara Case : అప్సర హత్య కేసులో వెలుగులోకి మరో కొత్తకోణం.. అప్సర పెళ్లిఫొటోలు వైరల్
మూడేళ్ల క్రితమే అప్సరకు వివాహం అయినట్లు తెలిసింది. ఆమె మొదటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Harishth Thanniru
- Updated on- June 11, 2023 / 05:27 PM IST
Apsara case
Apsara Case : హైదరాబాద్ (Hyderabad) లో పూజారి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన అప్సర కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్సరకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితమే అప్సరకు వివాహం అయినట్లు తెలిసింది. ఆమె మొదటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, అప్సరకు పెళ్లిజరిగిన కొద్ది రోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య అనంతరం అప్సర హైదరాబాద్ చేరుకుంది. కొద్దిరోజులకు జాతకం చూపించడంకోసం బంగారు మైసమ్మ ఆలయంకు అప్సర వెళ్లింది. అప్పటి నుండే సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
Apsara Case: అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు.. ఆమె నిద్రపోతున్న సమయంలోనే పూజారి..
బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి సాయికృష్ణ. గత ఏడాది నవంబర్‌లో వీరిద్దరూ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారకగుడిని సందర్శించారు. గుజరాత్ వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఈ క్రమంలో తనగతం మొత్తాన్ని అప్సర సాయి కృష్ణకి చెప్పింది. అప్పటికే మనసికంగా బాధ పడుతున్న అప్సరకి సాయికృష్ణ మరింత దగ్గరయ్యాడు.
ఈ క్రమంలో.. అప్సర వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. దీంతో, ఆమె అడ్డు తొలగించుకునేందుకు సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం సాయికృష్ణ చర్లపల్లి జైలులో ఉన్నాడు. సాయికృష్ణ కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మరోవైపు పోస్టుమార్టం అనంతరం అప్సర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
