Himanshu Rao: ఇవాళ హిమాన్షు నా కళ్లు తెరిపించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేస్తాడు. మంత్రి కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ఓ పాఠశాల రూపురేఖలనే మార్చేశాడు. దీంతో హిమాన్షుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Himanshu Rao Kalvakuntla

Himanshu Rao – Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మనవడు, మంత్రి కేటీఆర్ (KTR) కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ఇవాళ హైదరాబాద్ (Hyderabad) శివారులోని గౌలిదొడ్డి, కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కేటీఆర్ కూతురు అలేఖ్య పాల్గొన్నారు. హిమాన్షు కేక్ కట్ చేసిన అనంతరం అరికపూడి గాంధీ మాట్లాడారు.

ఇవాళ హిమాన్షు తన కళ్లు తెరిపించారని గాంధీ అన్నారు. హిమన్షు మౌనంగా అందరినీ ప్రశ్నిస్తున్నారని, తన వంతుగా స్కూల్ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. మనం ఏమి చేస్తున్నామని ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు, ఐటీ సంస్థలు.. పాఠశాలలను దత్తత తీసుకోవాలని చెప్పారు.

శేరిలింగంపల్లి పరిధిలోని 62 పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పాఠశాలకు ఈ రోజు పునర్జన్మ లాంటిదని చెప్పారు. పేద, మధ్యతరగతి పిల్లలు చుదువుకునే పాఠశాలలు బాగుండాలని అన్నారు. ఇది ఓ మంచి కార్యక్రమమని చెప్పారు. పేదలకు సాయం చేసే గుణం కేసీఆర్ జీన్స్ నుంచి వచ్చిందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఇదే స్థాయిలో వృద్ధి చేయాలి అనేదే సీఎం లక్ష్యమని తెలిపారు. తాను, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కాలనీ మొత్తాన్ని దత్తత తీసుకుంటామని అన్నారు. కాగా, రూ.కోటి నిధులు సేకరించిన హిమాన్షు కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలను బాగుచేయించారు. ఇవాళ దీన్ని ప్రారంభించారు.

CI Viral Video: జనసేన నాయకుడి చెంపచెళ్లుమనిపించిన మహిళా సీఐ.. అప్పుడు, మళ్లీ ఇప్పుడు..

ట్రెండింగ్ వార్తలు