Medak Battlefield : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.

Medak High Voltage Politics Battlefield

సీఎం కేసీఆర్ అడ్డా.. మంత్రి హరీశ్‌రావు ముద్ర.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మెదక్ జిల్లాలో కారుదే జోరు. గత రెండు ఎన్నికల్లోనూ 9 చోట్ల గులాబీ జెండానే రెపరెపలాడింది. 2014లో జహీరాబాద్, నారాయణఖేడ్ లో గెలిచిన కాంగ్రెస్ 2018లో సంగారెడ్డిలో మాత్రమే విజయం సాధించింది. అది కూడా స్వల్ప తేడాతోనే. ఇక దుబ్బాక ఉపఎన్నికలో తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది. ఈసారి 10 నియోజకవర్గాల్లోనూ గులాబీని గుబాళించి.. మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నారు మంత్రి హరీశ్‌రావు. ఐతే ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి విపక్ష బీజేపీ, కాంగ్రెస్.

Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

ఇక గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం. ఇక కాంగ్రెస్ కూడా మెదక్‌లో కారును ఢీ కొట్టేందుకు రెడీ కాగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, అందోల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్‌లో సీనియర్ నేత చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపి పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతోంది.

Also Read : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు

ఉమ్మడి మెదక్‌లో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు నెలకొనగా.. దుబ్బాక, గజ్వేల్ లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. పటాన్ చెరులో బీఎస్పీ సైతం పోటీలో నిలుస్తోంది. మొత్తం 10 నియోజకవర్గాల్లోని 31 మంది ప్రధాన అభ్యర్థుల బలం.. బలహీనత.. గెలుపు అవకాశాలపై 10 TV ప్రత్యేక విశ్లేషణ.. బ్యాటిల్ ఫీల్డ్..

 

 

 

ట్రెండింగ్ వార్తలు