Revanth Reddy : కామారెడ్డికే కాదు శంకరగిరి మాన్యాలకు పోయినా కేసీఆర్‌ ఓటమి ఖాయం- రేవంత్ రెడ్డి

Revanth Reddy On CM KCR Defeat : కేసీఆర్ ఓడితే ఫామ్ హౌస్ లో పండటం కాదు, నువ్వు దోచుకున్న లక్ష కోట్లు గుంజడం ఖాయం. కేసీఆర్ తింటే బకాసురుడు, పంటే కుంభకర్ణుడు.

Revanth Reddy On CM KCR Defeat (Photo : Facebook)

తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. నేతలు ఒకరిపై మరొకరు నేరుగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కామారెడ్డికే కాదు శంకరగిరి మాన్యాలకు పోయినా కేసీఆర్‌ను ప్రజలు ఓడించడం ఖాయం అని రేవంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఅర్ చరిత్రను ప్రజలు గమనించాలని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని గజ్వేల్ ప్రజలు ఆలోచిస్తుంటే కేసీఅర్ కామారెడ్డి వెళ్లారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Also Read : ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. దళిత సీఎంని చూడలేకపోయాం, బీసీనైనా సీఎంగా చూడాలి : పవన్ కల్యాణ్

”కామారెడ్డిలో అసలోడు ఉన్నాడు. గజ్వేల్ నుండి కామారెడ్డికే కాదు కన్యాకుమారి కానీ శంకరమాన్యాలకు పోయినా ప్రజలు కేసీఆర్ ను ఓడించడం ఖాయం. కేసీఆర్ వచ్చినప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు ఎర్రవల్లిలో ఎలా ఉండు? కాలువలు ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నాయి. ప్రజల భూములు తీసుకొని అతని బంధువు కావేరి భాస్కర్ భూములు కాపాడుకుండు. కేసీఅర్ పండించిన వడ్లను కావేరి వాళ్ళు 4వేల 250కి కొంటున్నారు. గజ్వేల్ రైతుల వడ్లకు ఒక ధర కేసీఅర్ వడ్లకు ఒక ధర.

కేసీఆర్ నువ్వు ఓడితే ఫామ్ హౌస్ లో పండటం కాదు, నువ్వు దోచుకున్న లక్ష కోట్లు గుంజడం ఖాయం. కేసీఆర్ తింటే బకాసురుడు, పంటే కుంబకర్ణుడు. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు కబ్జా చేసిన బకాసురుడు కేసీఅర్. అమ్మలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలి. నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి కేసీఅర్ కొడంగల్ పోయిండు.

Also Read : కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్‌పై విజయశాంతి మాటల తూటాలు

నా నోరు కంపు ఉందని కేసీఅర్ అంటుండు. ఇద్దరం కలిసి దవాఖాన వెళ్దాం. ఎవరిది కంపో తెలుస్తది. నేను సుక్క ముట్టను, కేసీఅర్ సుక్క లేనిది ఉండడు. నేనెక్కడ నువ్వెక్కడ? గృహలక్ష్మి పథకం కింద వ్యవసాయానికి, నిరు పేదలకు ఉచిత కరెంట్ ఇస్తాం. ఈనెల కేసీఅర్ ఉంటే 2వేలే. వచ్చే నెల కేసీఅర్ ను బొంద పెడితే 4వేల పెన్షన్ ఇస్తాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు