DK Aruna Daughter: డీకే అరుణ కూతురిపై అట్రాసిటీ కేసు.. ‘ఇదంతా వాళ్ల పనే’

మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై శ్రుతి స్పందించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ , ఎ

dk aruna

DK Aruna Daughter: మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై శ్రుతి స్పందించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలిసింది. ఆ కేసు కోర్టు నుండి వచ్చినట్టు తెలిసిందని అన్నారు. అసలు తాను దూషించానని చెబుతున్న ఎలీషా బాబు ఎవ్వరో కూడా తనకు తెలీదని వెల్లడించారు.

‘ఇదంతా పొట్లూరి వర ప్రసాద్ ఆడిస్తున్న డ్రామా. మా కమ్యూనిటీ హాల్ నాదంటూ పీవీపీ వాదించడం కరెక్ట్ కాదు. కోర్ట్ ఆర్డర్ ఏముందో మాకు తెలియదు. తన ఇంటి గోడను పడగొట్టేందుకు పీవీపీ మనుషులను పంపించాడు. ఇప్పటికే పీవీపీపై అనేక కేసులు ఉన్నాయి..

విల్లా కొనుగోలు చేసింది గొడవలు పెట్టుకోవడానికి కాదు. గతంలో కూడా పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని శ్రుతిరెడ్డి వివరించారు.

Read Also: ఎస్బీఐలో 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎలీషాబాబుని దూషించారనే అభియోగాలతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. డీకే శ్రుతి రెడ్డి, వినోద కైలాస్‌లపై కేసు నమోదైంది. ఐపీసీ 323,336,341,384,448,506 రెడ్ విత్ 34, SC ST POA Act 3(C),3(r),3(s)సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

బంజారాహిల్స్‌లోని పీవీపీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమను శ్రుతి రెడ్డి దూషించారని ఎలీషా బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.