×
Ad

Video: తీవ్ర ఉద్రిక్తత మధ్య బాల్క సుమన్‌ అరెస్ట్‌.. కోర్టుకు తరలించిన పోలీసులు

పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని నిన్న బాల్క సుమన్‌పై రామకృష్ణ పూర్ పీఎస్‌లో దేవాపూర్ ఎస్‌హెచ్‌వో ఫిర్యాదు చేశారు.

  • నిన్న మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
  • బందోబస్తు విధులకు ఆటంకం కలిగించారని కేసు
  • పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదు

Balka Suman: బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌ కార్యకర్తలు రావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి, శ్రీరాంపుర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు బాల్క సుమన్‌ను పోలీసులు హాజరుపర్చారు.

Also Read: Hyderabad: అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి మహిళపై అతి దారుణానికి పాల్పడ్డ మాజీ భర్త.. ఆమె గర్భవతి

పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని నిన్న బాల్క సుమన్‌పై రామకృష్ణ పూర్ పీఎస్‌లో దేవాపూర్ ఎస్‌హెచ్‌వో ఫిర్యాదు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం వంటి ఘటనకు పాల్పడ్డారని చెప్పారు.

కోటపల్లి ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేశ్‌కు గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేశ్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును పలువురు బీఆర్ఎస్‌ నేతలు ఖండించారు.