Bandi Sanjay: బండి సంజయ్‌ని రిలీజ్ చేయండి.. జైళ్ల శాఖకు హైకోర్టు ఆదేశం

ట్టకేలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయింది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

Bandi Sanjay Slams Cm Kcr

Bandi Sanjay: ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయింది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది బీజేపీ లీగల్ సెల్ వెల్లడించింది.

ఎంపీ సంజయ్ తరపు న్యాయవాది అయిన దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. జీఓ 317ను రద్దు చేయాలని దీక్ష తలపెట్టాడు. కొవిడ్ పరిస్థితుల్లో పోలీసులు చెదరగొట్టాలని చూస్తే ఆస్తులను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఎంపీను రాత్రి 10గంటల 50నిమిషాలకు అరెస్ట్ చేసి 11గంటల 15నిమిషాలకు FIR నమోదు చేశారు’

‘మేజిస్ట్రేట్ జ్యూడిషల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైనది కాదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదు’ అని వాదనలు వినిపించడంతో పర్సనల్ బాండ్ 40వేలపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్