Bandi Sanjay: హైదరాబాద్ చేరుకున్నాక కిషన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
బండి సంజయ్ మాట్లాడుతూ... తనను రారా.. పోరా అనే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : July 6, 2023 / 07:08 PM IST
Bandi Sanjay
Bandi Sanjay – BJP: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీ (Delhi) నుంచి హైదరాబాద్ (Hyderabad), శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… తనను రారా.. పోరా అనే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పారు. విద్యార్థి పరిషత్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కిషన్ రెడ్డికే తాను ఫోన్ చేసేవాడినని తెలిపారు. ఆయన నాయకత్వంలో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
ఈ నెల 8న ఓరుగల్లులో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రస్తుత పరిణామాలను ఇతర పార్టీల వారు అవకాశంగా తీసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని తెలిపారు. తాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించటానికి ఐక్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
