Bandi Sanjay : కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు-బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. అడ్డంగా ఆస్తులు సంపాదించి డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Naveen
- Published On : July 21, 2022 / 09:05 PM IST
Bandi Sanjay
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. అడ్డంగా ఆస్తులు సంపాదించి డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు..కానీ, కేసీఆర్ మాత్రం 800 కోట్ల రూపాయలతో ప్రగతిభవన్ కట్టుకుని జల్సా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తోందని, ఆ పార్టీకి సిగ్గుండాలని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు బండి సంజయ్. మోదీ, అమిత్ షాలు కూడా ఈడీ విచారణ ఎదుర్కోని కడిగిన ముత్యాల్లా బయటకి వచ్చారని చెప్పారు బండి సంజయ్.
