Bandi Sanjay Slams Cm Kcr
Bandi Sanjay : టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు కూడా ఈడీ, ఐటీ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ టైం వేస్ట్ చేయడు.. టైం పాస్ చేస్తాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలోనే కేసీఆర్ ధర్నా చేయలేదని, ఇప్పుడు వరి కోసం ఏమి చేస్తడంటూ మండిపడ్డారు. ప్రజలలో సింపతి కోసమే ప్రెస్ మీట్లో అలా మాట్లాడుతున్నాడని అన్నారు. తాను అన్నింటికీ సమాధానం చెప్పినానని అన్నారు.
కేసీఆర్ ఎందుకు మాట్లాడుతలేడు.. రైతులకు వాస్తవాలు తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే లెటర్ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్నారు. వానాకాలం పంట కొంటరా కొనరా చెప్పకుండా ధర్నా చేస్తున్నారని బండి సంజయ్ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈరోజు రైతు సమస్యలపై ధర్నాలు చేశారా లేక అంతర్జాతీయ సమస్యలపై ధర్నా చేసారా? చెప్పాలన్నారు. ఖరీఫ్ మొదలైన తరువాత ఎంత పంటలు వేసినారో రాష్ట్రం ప్రభుత్వం సర్వే చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంకా పంటనే వెయ్యలేదు.. కేంద్రం ఏమని లేఖ ఇస్తుందన్నారు.
ఒకవైపు రైతులు వర్షాలు పడుతాయని ఆందోళనలో ఉంటే.. టీఆర్ఎస్ వాళ్లు ధర్నాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ధర్నాకు వచ్చిన వారే కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారని, వాళ్లకు వాస్తవ విషయాలు తెలిసినట్టు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి కావాలి అనుకునే వారే మందు పోస్తారని, నేను ఎందుకు పోస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also : WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్