Bandi Sanjay: బీజేపీ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ దాడి.. పోలీసులు తమాషా చూస్తున్నారా? బండి సంజయ్ ఆగ్రహం

హైదరాబాద్‌ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Bandi sanjay slams youth congress attack on bjp hyderabad office

  • బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడి
  • పోలీసుల తీరుపై సంజయ్ ఫైర్
  • నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి

Bandi Sanjay: హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలే జాతీయ పార్టీ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమాషా చూస్తున్నారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయం గేటుకు నల్ల రంగు పూసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందో చెప్పాలని ఆయన నిలదీశారు.

Ap Liquor Scam: ఏపీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు సుప్రీం నోటీసులు.. విచారణపై ఉత్కంఠ

పోలీసుల తీరుపై ఆగ్రహం:

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ వెంటనే తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సంఘటన పూర్వాపరాలను ఆరా తీశారు. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పగటిపూటే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించిన ఆయన, తమ విధి నిర్వహణలో విఫలమైన పోలీసు అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక, సాయంత్రంలోగా అరెస్ట్ చేయాలని డిమాండ్:

ఈ ఘటనకు బాధ్యులైన యూత్ కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి, సాయంత్రంలోగా చట్టం ముందు నిలబెట్టాలని కేంద్రమంత్రి స్పష్టమైన డిమాండ్ చేశారు. తమ పార్టీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బీజేవైఎం కార్యకర్తలు రంగంలోకి దిగితే కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తాయని, అనంతరం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.