Bandi Sanjay America Tour
Bandi Sanjay America Tour : బీజేపీ జాతీయ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ అమెరికాకు వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) తెల్లవారుజామున ఆయన యూఎస్ కు బయల్దేరి వెళ్లనున్నారు. బండి సంజయ్ 10 రోజులపాటు యూఎస్ లోనే ఉండనున్నారు.
సెప్టెంబర్ 2న అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్తా)15 వార్షికోత్సవంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఖరారు అయింది.
ఈ సందర్భంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. యూఎస్ సందర్శన నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై బండి సంజయ్ ప్రదర్శించబడుతారు.