Ration Card Alert : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే కార్డు రద్దయ్యే చాన్స్! అక్టోబర్ నుంచి కొత్త విధానం

Ration Card Alert : ఆరు నెలలుగా రేషన్ తీసుకోని సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులపై కేంద్రం కీలక చర్యలకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి తాత్కాలికంగా రేషన్ నిలిపివేయనుంది.. ఆ తరువాత ఈ-కేవైసీ పూర్తి చేస్తే మళ్లీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంది.. లేదంటే కార్డు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది.

Ration Card Alert

Ration Card Alert : రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉందిగా అని నిశ్చింతగా ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా కోట్లాది మంది రేషన్ కార్డు లబ్ధిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి కార్డులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్టోబర్ నుంచి సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిసింది. అయితే, మీ కార్డుకు కూడా ఇదే పరిస్థితి వస్తుందా? తొలగించే కార్డుల జాబితాలో మీ కార్డు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Also Read : Gold-Silver Prices Today : గోల్డ్ ప్రియులకు పండుగే.. భారీగా తగ్గిన బంగారం రేటు.. నేటి ధరలు ఇవే..

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో ఉన్న రేషన్ కార్డుల డేటాపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. గత ఆరు నెలలుగా తమ రేషన్ కార్డుపై ఎలాంటి ఆహార ధాన్యాలను తీసుకోని కార్డులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సుమారు 1.58కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను అక్టోబర్ నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే, లబ్ధిదారుల పేర్లను డేటా నుంచి వెంటనే తొలగించరు. వారు నిజమైన లబ్ధిదారులని నిరూపించుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వనున్నారు.

అధికారుల సమాచారం ప్రకారం.. ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారిని గుర్తించి మొదట వారి రేషన్ కార్డును తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ వ్యవధిలో సంబంధిత లబ్ధిదారులు తమ అర్హతను నిరూపించుకోవడంతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేస్తే.. రేషన్ కార్డులను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ విధానంపై విమర్శలుసైతం వెల్లువెత్తుతున్నాయి. రేషన్ తీసుకోని కారణాన్ని ముందుగా తెలుసుకోకుండా కార్డును నిలిపివేయడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలు, వలసలు, రేషన్ డీలర్ తో సమస్యల కారణంగా కొంతమంది రేషన్ తీసుకోకపోయి ఉండొచ్చునని.. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల నిజమైన లబ్ధిదారులకూ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో నకిలీ, డూప్లికేట్, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న లేదా ప్రస్తుతం అర్హతలేని రేషన్ కార్డులను గుర్తించడానికి ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధమైంది. దీని వల్ల రేషన్ నిజమైన లబ్ధిదారులకు చేరుతుందని, రేషన్ వృథా కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఆధార్ అనుసంధానం, డిజిటలైజేషన్, ఈ-కేవైసీ వంటి విధానాల ద్వారా ఇప్పటికే పీడీఎస్ డేటాను ప్రక్షాళన చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తంగా చూస్తే.. ప్రజా పంపిణీ వ్యవస్థలో అనర్హమైన, నకిలీ లేదంటే ఉపయోగంలోలేని రేషన్ కార్డులను గుర్తించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అర్హులైన లబ్ధిదారులు అనుకోకుండా రేషన్ కోల్పోకుండా ఉండేందుకు ఈ-కేవైసీ పూర్తి చేయడం, తమ రేషన్ కార్డు వివరాలను సరిచూసుకోవడం కీలకం.