Gold-Silver Prices Today : గోల్డ్ ప్రియులకు పండుగే.. భారీగా తగ్గిన బంగారం రేటు.. నేటి ధరలు ఇవే..
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అప్డేట్. గోల్డ్ రేటు ఇవాళ తగ్గింది.

Gold-Silver Prices Today : అక్టోబర్ నెల వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలు కానుంది. ఈ నెలలో పెద్ద సంఖ్యలో మహిళలు బంగారం కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ప్రియులకు ఊరట కలిగించేందుకు ధరలు తగ్గుముఖం పట్టాయి.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోమ, మంగళవారాల్లో గోల్డ్ రేటు తగ్గగా.. బుధవారం పెరిగింది. అయితే, ఇవాళ (గురువారం) గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 300 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల బంగారంపై సుమారు రూ.3500 తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,175 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారత దేశంలో వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,240 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,390 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,240కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు
