Bandi Sanjay
BJP: తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు మూడ్రోజుల తర్వాత విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు రూ.40వేల పూచీకత్తుపై బెయిల్ ఇష్యూ చేయడంతో బయటికొచ్చారు. పార్టీ నేతల మధ్య జరిగిన చర్చల తర్వాత అన్ని నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటించింది.
జీఓ 317 సవరణపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కార్యచరణను మరోసారి ప్రకటిస్తామని తెలిపింది బీజేపి. జనవరి 10వ తేదీన బంద్ తలపెట్టాలని బుధవారం ప్రకటించిన నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద సభను నిర్వహించనున్నారు.
ఎల్లుండి స్టేట్ ఆఫీస్ వద్ద బండి సంజయ్‌కి వెల్‌కమ్ సభా ఏర్పాటుచేయనుంది బీజేపీ. సభకు చీఫ్ గెస్ట్‌గా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆహ్వానించింది బీజేపీ.
ఇది కూడా చదవండి : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ ప్రారంభం నుంచి ఇవాళే అత్యధిక కేసులు
గురువారం కూడా బండి సంజయ్ కరీంనగర్ లోనే ఉండనున్నారు. మాజీ సీఎం రామన్‌సింగ్, రాష్ట్ర నాయకులు ఆయణ్ను కలిసేందుకు కరీంనగర్ వెళ్లనున్నారు. శుక్రవారం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవనున్నారు సంజయ్.