Covid Cases In Mumbai : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ ప్రారంభం నుంచి ఇవాళే అత్యధిక కేసులు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో

Covid Cases In Mumbai : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ ప్రారంభం నుంచి ఇవాళే అత్యధిక కేసులు

Virus

Covid Cases In Mumbai : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో మంగళవారం నమోదైన కోవిడ్ కేసులు(10,860)కంటే ఇవాళ 39శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి.

ముంబైలో గత 24 గంటల్లో 15,166 కొత్త కోవిడ్ కేసులు,3 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి నుంచి ఒక్కరోజులో ముంబైలో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇవే అత్యధికం. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఏప్రిల్-4,2021న ముంబైలో నమోదైన 11,163 కోవిడ్ కేసులే ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులుగా ఉన్నాయి. అయితే ఈ రికార్డును చెరిపివేస్తూ ఇవాళ భారీగా కోవిడ్ కేసులు నమోదుకావడం ప్రజలను టెన్షన్ పెడుతోంది.

బుధవారం 1218 కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరారని,ఇందులో 80 మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో 87శాతం అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారులు తెలిపారు. ఇక,ముంబైలో ప్రస్తుతం 61,923 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. మరోవైపు,కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే ముంబైలో ఆంక్షలు విధించారు అధికారులు.

ALSO READ Delhi’s Covid Cases : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ..94శాతం పెరిగిన కొత్త కేసులు