Telangana BJP - Assembly Elections
Telangana BJP – Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాధికారులు సమావేశం అయ్యారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, డీకే అరుణ, సోయం బాబూరావుతో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు.
ఎన్నికల కోసం 22 కమిటీల నియమాకంపై చర్చిస్తున్నారు. ప్రచార కమిటీ రేసులో బండి సంజయ్, డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రేసులో మాజీ ఎంపీ వివేక్ ఉన్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవం కార్యాచరణపైనా చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనా సమాలోచనలు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పదాధికారులు సమావేశం అయ్యారు. దీనికి పార్టీ ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఎలా ప్రజల్లోకి వెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. గ్రామగ్రామానికి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేదానిపై చర్చిస్తున్నారు.
అదే విధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించి చర్చిస్తున్నారు. జన సమీకరణ, దాన్ని ఎలా విజయవంతం చేయడం అనేదానిపై చర్చిస్తున్నారు.