Raja Singh : ధర్మం కోసం నేను చావటానికైనా సిద్ధం .. చచ్చే వరకు బీజేపీ కార్యకర్తగానే ఉంటా..

అరెస్ట్ చేసినా రాజాసింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..ధర్మం కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి స్పష్టం చేశారు.

MLA Raja Singh Sensational Comments On Protests : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాస్తా ఆయనను అరెస్ట్ చేయటమేకాకుండా.. ఏకంగా పార్టీ అధిస్టానం పార్టీనుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లింది.రాజాసింగ్ అరెస్ట్ పాతబస్తీలో హై టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..ఆ వీడియోను యూ ట్యూబ్‌లో విడుదల చేయడం ఓ వర్గం నేతలను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో రాజాసింగ్ మీద కేసులు నమోదు కావటం..ఆయనను అరెస్ట్ చేయటం అంతా చకచకా జరిగిపోయాయి.

అరెస్ట్ చేసినా రాజాసింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..ధర్మం కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి స్పష్టం చేశారు.రాజాసింగ్‌.. ఓ వర్గం మనోభావాలు కించపరిచారంటూ పాతబస్తీలో ఆవర్గానికి చెందిన నేతలు ఆందోళనలకు దిగారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలా ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో​ పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్‌ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్‌ వివాదాస్పద వీడియోను తొలగించింది.

ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో​ మాట్లాడుతూ.. మునావర్‌కు కౌంటర్‌ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్‌ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్‌లోడ్‌ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉండితీరుతుంది నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. తనవ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయనే విషయం తనకు తెలుసని.. కానీ, ధర్మం కోసం తాను ఇలాగే మాట్లాడతానని చెప్పారు.

చావుకు సైతం తాను సిద్ధమేనని అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వీడియో రెండో పార్ట్ విడుదల చేస్తానని రాజాసింగ్ తనదైన శైలిలో తెలిపారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను ఎప్పుడూ మోడీ, అమిత్ షా ఫాలోయర్ గానే ఉంటానని..చచ్చేవరకు బీజేపీ కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని బొల్లారం పీస్ కు తరలించారు. ఈరోజే రాజాసింగ్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు