MP Bandi Sanjay Kumar: హోంగార్డు రవీందర్ మృతికి ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత

రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత అని, సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay

Home Guard Ravinder Died : హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి చెందారు. కంచన్‌బాగ్ అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు.

Home Guard Ravinder : జీతం టైంకి ఇవ్వకపోవడం వల్లే నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు : హోంగార్డు రవీందర్ భార్య సంధ్య

మరోవైపు రవీందర్ మృతితో హోంగార్డులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇటీవలే గోషామహల్ స్టేడియం కమాండ్ రూమ్‌కు వెళ్లిన హోంగార్డు రవీందర్‌, జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురై అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్‌తో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఇదిలాఉంటే తన భర్త మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆరోపిస్తున్నారు.  హోంగార్డు రవీందర్ మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Home Guard Ravinder Died : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి

హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత అని, సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని, రవీందర్ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్‌ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారిని అన్నివిధాలా ఆదుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.