Rtc Bus
Book TSRTC Bus : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను ఆదరించాలని, బస్సులను బుక్ చేసుకొంటే..బహుమతులను ఇస్తామని ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రయాణీకులతో అనుబంధం పెంచుకొనేందుకు సంస్థ యాజమాన్యం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పెళ్లిళ్లకు బస్సులను కిరాయికి తీసుకుంటే..వధూవరులకు ఆర్టీసీ సంస్థ తరపున బహుమతులివ్వాలని నిర్ణయం తీసుకోవడబం జరిగిందని సజ్జనార్ వెల్లడించారు. 2021, నవంబర్ 11వ తేదీ గురువారం ఆకుల భరత్, వధువు సౌమ్య వివాహం జరిగింది.
Read More : Rakesh Jhunjhunwala : తక్కువ ధరకే విమాన టికెట్, ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు ?
ఈ సందర్భంగా వివాహానికి బంధు మిత్రులను ఆహ్వానించారు. పెళ్లి వేదికకు హాజరయ్యేందుకు వధూవరుల కుటుంబాలు యాదగిరిగుట్ట నుంచి కొంపల్లి వరకు రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సజ్జనార్…వారి వివాహానికి హాజరయ్యారు. అనంతరం డ్రైవర్ల సమక్షంలో వధూవరులకు బహుమతులను అందచేశారు.
Read More : Prime Minister Modi : ఈ పథకాలు సురక్షితం…పెట్టుబడి పరిధిని విస్తరిస్తాయి
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు.