KTR ED Investigation : 7 గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ.. బీఆర్ఎస్ క్యాడర్ లో టెన్షన్..

వారు ఇచ్చిన కొన్ని సమాధానాలపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

KTR ED Investigation : ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. ఈడీ సుదీర్ఘ విచారణతో బీఆర్ఎస్ క్యాడర్ లో టెన్షన్ పెరుగుతోంది. ఏం జరగనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో నగదు బదిలీలు ఏ విధంగా జరిగాయి? బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి? ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేది ప్రధాన అభియోగం. దానికి సంబంధించిన ఈడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం. మరోవైపు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ.. వారి స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. వారు ఇచ్చిన కొన్ని సమాధానాలపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

Also Read : కేటీఆర్‌ని కక్ష పూరితంగా అరెస్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వం యత్నాలు: మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

ఇదే కేసులో ఏసీబీ అధికారులు సైతం కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆయన స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రధానంగా ఏసీబీ దర్యాఫ్తు చేస్తుంటే.. ఇక, ఈడీ మాత్రం ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

మరొకసారి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కేటీఆర్ కు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ్టి విచారణలో కేటీఆర్ ను 25 నుంచి 30 ప్రశ్నలు మాత్రమే ఈడీ అధికారులు అడిగినట్లుగా సమాచారం. మిగిలిన వాటికి మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు ఈడీ అధికారులు చెప్పే అవకాశం ఉంది. గతంలో అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ అధికారులు అదే విషయం చెప్పారు. ఈ క్రమంలో అందుబాటులో ఉండాలని కేటీఆర్ కు కూడా చెప్పే అవకాశం ఉంది.

Also Read : దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్..! ఈటల, హరీశ్‌, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?