Revanth Reddy : 24గంటల ఉచిత విద్యుత్.. పక్కా మోసం- సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy : తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్.

Revanth Reddy(Photo : Google)

Revanth Reddy – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 12గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు రేవంత్ రెడ్డి.

Also Read..Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

” బీఆర్ఎస్ బీజేపీకి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది. రేపు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా “సత్యాగ్రహ దీక్ష” పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తోంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం” అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

చిచ్చు రాజేసిన రేవంత్ కరెంట్ వ్యాఖ్యలు..
కాగా.. రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని.. మూడు గంటలు ఇస్తే చాలంటూ అమెరికా పర్యటలో ఉన్న రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అనవసరంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసరం లేదని చెప్పారు. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ సొంత పార్టీలోనే చిచ్చు పెట్టాయి. అధికార పక్షం నేతలే కాదు కాంగ్రెస్ నాయకులు సైతం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. రేవంత్ కామెంట్స్ సొంత పార్టీ నేతలను అయోమయంలో పెడితే, బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అసలు బుద్ధి బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైఖరి ఏంటో అర్థం చేసుకోవాలంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు