Telangana : బీజేపీకి బుద్ధి లేదు .. కాంగ్రెస్‌కు కామన్‌సెన్స్ లేదు : గుత్తా సుఖేందర్

బీజేపీ,కాంగ్రెస్ లపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్..ఇంక మీరు మారరా? కర్ణాటక ఫలితాలు చూసికూడా బీజేపీ మత యాత్రలా? ప్రజల్లో చిచ్చు పెట్టటానికా..?

Gutta Sukhender

Telangana : కర్ణాటకలో కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి క్లియర్ కట్ ఫలితాలు వచ్చినా ఇంకా సీఎం అభ్యర్థిని నిర్ణయించకుండా జాప్యం చేస్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కాంగ్రెస్ కు గుణపాఠం నేర్చుకోవటంలేదు అంటూ బీఆర్ఎస్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఎద్దేవా చేశారు.అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీని చిత్తుగా ఓడించినా బీజేపీకి మాత్రం బుద్దిరాలేదని ఇంకా మతం పేరుతో యాత్రలు చేస్తోంది అంటూ తెలంగాణలో బండి సంజయ్ ‘హిందు ఏక్తా’పేరుతో చేపట్టిన యాత్రను ఉద్ధేశించి విమర్శించారు గుత్తా సుఖేందర్.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావాల్సినదానికంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంది. కానీ ఫలితాలు వెలువడి మూడు రోజులు అవుతున్నా సమావేశాలు అంటూ జాప్యం చేస్తు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవటం కాంగ్రెస్ అధిష్టానం చేతకాని తనం అంటూ గుత్తా ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావాల్సిన అవకాసాలు వచ్చినా ఆ దిశగా చొరవతీసుకోకుండా గతంలో కూడా కాంగ్రెస్ దెబ్బతింది. అయినా ఇప్పటికే వివరం రాలేదు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా..కనీసం ఇప్పటికి కూడా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకుండా జాప్యం చేయటం చేతకానితనం అంటూ ఎద్దేవా చేశారు గుత్తా.

అలాగే బీజేపీపై గుత్తా విమర్శలు చేస్తు..కర్ణాటకలో ప్రజలు బీజేపీని తిరస్కరించారని..అయినా బుద్ది లేకుండా తెలంగాణలో మతం పేరుతో యాత్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు గుత్తా. మతరాజకీయాలు చేస్తు ప్రజల్లో చిచ్చు పెడుతున్న బీజేపీకి తెలంగాణ బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు.

కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. కనీ వినీ ఎరుగని విజయాన్ని చేజిక్కించుకుంది. బీజేపీని చావుదెబ్బ కొట్టింది.  30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇదే అతిపెద్ద విజయం. ఇక పోతే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 65 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక స్థానిక జనతాదళ్ సెక్యులర్ అయితే కేవలం 19 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుని భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే తరువాయి. కానీ ఇంకా సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమావేశాలు జరుపుతునే ఉంది.ఈరోజు సాయంత్రానికి కర్ణాటక సీఎం ఎవరో తేలిపోనుంది.