KTR : తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు.

Telangana formation day celebrations

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

Also Read : Pawan Kalyan : అటు సభకు నో పర్మిషన్.. ఇటు తెలంగాణ ఆవిర్భావం వేళ పవన్ కామెంట్స్.. ‘ఈ నేల నుంచే..’

వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావొద్దు అనుకుంటే సింహం తన కథ తను చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గురించి మనమందరం చెప్పుకోవాలని అన్నారు. 2028 డిసెంబర్‌లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. అందరి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. అబద్ధాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొనితెచ్చుకున్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను మరో 20 యేండ్లు వెనక్కి నెట్టింది. కేసీఆర్ హయంలో వడ్డించిన విస్తరాకును కుక్కలు చింపిన విస్తరాకుల రేవంత్ రెడ్డి చేశాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

యూరియా ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటలు కొనలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకొని పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క ఇటుక పెట్టకుండా 4 లక్షల కోట్ల అప్పు చేశారు. రైతు బంధు బంద్ ఆగింది, రాహుల్ బంద్ కొనసాగుతుంది. అధికారంకోసం ఆరాటం ఏం లేదు, అధికారం వస్తే వస్తుంది లేకపోతే లేదు. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తూ ముష్కరులపాలైందన్న కేటీఆర్.. మనమందరం కలిసి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.