Harish Rao : డీపీఆర్ లేకుండా కూల్చుడేంది? రేవంత్ సర్కార్ పై హరీశ్‌రావు ఫైర్.. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.. కానీ..

Harish Rao : రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని, సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao

  • మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
  • సుందరీకరణ ముసుగులో రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం 
  • డీపీఆర్ లేకుండా ఇళ్లను ఎలా కూల్చేస్తావ్?
  • రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్

Harish Rao : రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని, సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని.. ఆయన పాలన తుగ్లక్ పాలన అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Also Read : Chennai Hotel Bill : ఓరేయ్.. ఎవర్రా నువ్వు..! ఇడ్లీ, వడతోపాటు గ్యాస్ ఛార్జీలతో బిల్లు.. నెటిజన్లు ఫుల్ ఫైర్

మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశారా..? చేస్తే ప్రజల ముందు పెట్టాలని హరీశ్ రావు అన్నారు. కనీసం డీపీఆర్ లేకుండా పేదల ఇళ్లు కూల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారు..? అంటూ ప్రశ్నించారు. డీపీఆర్ రూపొందించడానికి 18నెలల సమయం పడుతుందని రెండు నెలల క్రితం చెప్పారు. డీపీఆర్‌లో ఏముందో తెలియకుండా.. అసలు డీపీఆర్ లేకుండా పేదల ఇళ్లు ఎలా కూల్చుతారంటూ హరీవ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులే లేవంటున్న ప్రభుత్వం రూ.1.50లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. డీపీఆర్ లేకుండానే 10వేల17ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది అంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారంటూ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీమీద పడ్డారంటూ హరీవ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ బాధితుల పక్షాన ఉంటుందా..? మూసీ సుందరీకరణపై దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి వైపు ఉంటుందా అని సమాధానం చెప్పాలని హరీశ్ రావు అన్నారు. మూసీ సుందరీకరణకు నిధులు విడుదల అయ్యాయని అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హరీవ్ రావు అన్నారు.