BRS Trolls : కవిత టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ ట్రోలింగ్.. కోల్‌గేట్, బిస్లరీ వాటర్ బాటిల్ ఫొటోలు పెట్టి..
BRS Trolls Kavitha Party : కవిత టీఆర్ఎస్ పార్టీపై ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసింది. ఒరిజినల్ ఎప్పటిక ఒరిజినలే అంటూ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- April 25, 2026 / 03:48 PM IST
BRS Trolls Kavitha TRS Party
BRS Trolls Kavitha: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)పై బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విటర్ వేదికగా సైటర్లు వేసింది. ఒరిజనల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ పేర్కొంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కవిత.. భారీ జనసంద్రోహం మధ్య కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే, కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీ ప్రకటనపై బీఆర్ఎస్ ట్విటర్ వేదికగా ట్రోలింగ్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ పేర్కొంది.
Also Read : కేసీఆర్ టార్గెట్‌గా కవిత ఘాటు విమర్శలు.. నా తండ్రి కావొచ్చు.. కానీ.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్..
బీఆర్ఎస్ పోస్టులో రెండు కోల్గెట్.. రెండు బిస్లెరి వాటర్ బాటిల్స్‌ను పెట్టింది. ఇందులో ఒకటి ఒరిజినల్.. మరొకటి డూప్లికేట్ అంటూ అర్ధం వచ్చేలా.. అదే విధంగా ఒరిజినల్ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) మాదే.. డిప్లికేట్ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) కవితది అన్నట్లుగా అర్ధం వచ్చేలా పోస్టును పెట్టింది.
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf
— BRS Party (@BRSparty) April 25, 2026
