Ktr: రైతులకు మరణశాసనం.. పంటలు కొనే నాథుడే లేడు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణ సర్కార్ పై సంచలన కామెంట్స్ చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(Ktr).

BRS Working President KTR sensational comments about the Telangana government and cm revanth reddy

  • ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సంక్షోభం.
  • రైతులకు రేవంత్ మరణ శాసనం రాసారు.
  • రెండున్నరేళ్లలో ఒక్క మంచి పని చేయలేదు.

Ktr: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కుంటుపడిందని, ప్రస్తుత పాలన ప్రజా కంటకంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(Ktr) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న “ఇందిరమ్మ రాజ్యం” ప్రతి ఇంటికీ సంక్షోభాన్ని తెచ్చిపెట్టిందని ఆయన ఆరోపించారు.

Fire Accedent: కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. భవనం పైనుంచి దూకిన విద్యార్థులు

ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ మండిపడ్డారు. వచ్చే సీజన్‌ నుంచి రాష్ట్రంలో పండించే పంటలను కొనే నాథుడే లేకుండా పోయాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంటల కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అన్నదాతలకు మరణ శాసనంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజల కోసం ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేసిన దాఖలాలు లేవని కేటీఆర్ విమర్శించారు. కేవలం తప్పుడు వాగ్దానాలతో కాలయాపన చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరి వీడి రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.