Road Accident : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలం నల్లమలలో ఈ ప్రమాదం జరిగింది.
- Harish Thanniru
- Updated on- August 4, 2024 / 11:28 AM IST
Car Accident
Road Accident : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలం నల్లమలలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సునిపెంట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : విశాఖ రైల్వేస్టేషన్‌లో తప్పిన పెనుప్రమాదం.. దగ్దమైన రైలు బోగీలు
హైదరాబాద్లోని బొల్లారంకు చెందిన నలుగురు ఒకే కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. తెల్లవారు జామున నిద్రమత్తులో డ్రైవ్ చేయడంతో కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. కారులోని నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రి వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.
