Hyderabad : కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 బదులు రూ.600
హైదరాబాద్ నాచారంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.8000 కి బదులు రూ.600 రావడంతో కస్టమర్లు షాకయ్యారు. ఇలా పలువురికి జరగడంతో ఆందోళనకి దిగారు.
- Lakshmi 10tv
- Published On : July 16, 2023 / 03:19 PM IST
Hyderabad
Hyderabad : హైదరాబాద్ నాచారం ఏటీఎంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రూ.8000 నగదుకు బదులుగా రూ.600 రావడంతో కస్టమర్లు అవాక్కయ్యారు. పలువురికి ఇదే సంఘటన చోటు చేసుకోవడంతో ఆందోళనకు దిగారు.
ATM Video: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్రమత్తం అవ్వాల్సిందే..
నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ HDFC బ్యాంకు ఏటీఎంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. డబ్బులు డ్రా చేసుకుందామని వచ్చిన వినియోగదారులు రూ.8000 డ్రా చేస్తే రూ.600, రూ.1000 డ్రా చేద్దామనుకుంటే రూ.200 అమౌంట్ రావడంతో అవాక్కయ్యారు. దీనిపై టెక్నీషియన్‌ను నిలదీశారు. అయితే అతను కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇలా పలువురికి జరగడంతో వారంతా ఏటీఎం వద్ద ఆందోళనకి దిగారు.
గుడ్ న్యూస్.. ఇక కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి మనీ విత్ డ్రా
తమకు సరైన సమాధానం వచ్చేవరకు ఏటీఎం నుంచి కదిలేది లేదని వినియోగదారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై బ్యాంకు అధికారుల నుండి స్పందన రావాల్సి ఉంది.
