ATM Video: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్రమత్తం అవ్వాల్సిందే..

హిమాయత్ నగర్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తి నుంచి నలుగురు దుండగులు రూ. 7లక్షలు దోచుకెళ్లారు.

ATM Video: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్రమత్తం అవ్వాల్సిందే..

Hyderabad ATM Robbery

Hyderabad ATM Robbery: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థంకాని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. డబ్బులు జమ చేసుకొనే సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి అతని వద్ద సొమ్మును దోచుకెళ్లారు. అయితే, సీసీ పుటేజ్‌ల ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంత డబ్బును రికవరీ చేశారు. ఈ దోపిడీకి పాల్పడిన వారు కేరళ రాష్ట్రంకు చెందిన వారుగా పోలీసులు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Snakes in ATM : ఏటీఎంలోంచి నోట్లకు బదులు పాముపిల్లలు .. మిషన్‌లో పుట్ట పెట్టేసిందా ఏంటీ..!

హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తి నుంచి నలుగురు దుండగులు రూ. 7లక్షలు దోచుకున్న ఘటన జూలై 3న చోటు చేసుకుంది. బాధితుడు ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పెప్పర్ స్పే కొట్టి బాధితుడి వద్ద ఉన్న డబ్బుల బ్యాగును దోచుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఒకరు హెల్మెంట్ పెట్టుకోగా, మరొకరు ముఖానికి దస్తీ కట్టుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ దోమల్‌గూడ పోలీసులతో కలిసి కేసు విచారణ చేపట్టగా నిందితులను గుర్తించారు. జూలై 14న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3.25 లక్షల నగదుతో పాటు వాహనం, మోటార్ బైక్, దోపిడీకి ఉపయోగించిన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు కేరళకు చెందిన థాన్సిస్ అలీ, మహమ్మద్ సహద్, తన్సీహ్ బరిక్కల్, అబ్దుల్ ముహీస్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు బాబోయ్ అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ డబ్బును ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు, డ్రా చేసుకొనేందుకు వెళ్లేవారు తోడుగా తెలిసిన వారిలో నమ్మకమైన వ్యక్తులను తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ రాత్రి సమయంలో ఏటీఎం వద్దకు వెళ్లాల్సి వస్తే  తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.