Conocarpus Trees: ప్రపంచంలో ఏ చెట్టూ చెడ్డది కాదు, కోనోకార్పస్ చెట్లతో ఎలాంటి ప్రమాదమూ లేదు- సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు

వాహనాలు వదిలే ప్రమాదకరమైన వాయువులను పీల్చుకోవడంలో కోనో కార్పస్ ఉపయోగపడుతుంది.

Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లు విషవాయువులను విడుదల చేస్తాయా? ఆ చెట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయా? వాటిని కచ్చితంగా తొలగించాల్సిందేనా? ఇలాంటి అనుమానాలు, సందేహాలు, భయాలు ఎన్నో. కోనోకార్పస్ చెట్ల గురించి పెద్దఎత్తున డిస్కషన్ జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కోనోకార్పస్ చెట్ల గురించి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే, ఒక మూఢనమ్మకం, ఒక తెలియని ప్రచారం.. కోనోకార్పస్ చెట్టుకు గొడ్డలి పెట్టుగా మారిందా? అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని కొందరు వాదిస్తున్నారు. కోనోకార్పస్ చెట్టు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటుందని, మనుషులకు హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. కోనోకార్పస్ చెట్ల గురించి పెద్దఎత్తున డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో దీనిపై సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో ఏ చెట్టు కూడా చెడ్డది కాదంటున్నారు మోహన్ రావు. మనం వాడుతున్న అవసరాన్ని బట్టి మాత్రమే అది ఉంటుందన్నారు. ”అన్ని రకాల చెట్ల వేర్లు లోపలికి వెళ్తాయి. మిగతా చెట్ల మాదిరే కోనోకార్పస్ చెట్టు ఉంటుంది. కోనో కార్పస్ చెట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 2023 జనవరిలో పబ్లిష్ అయిన పేపర్ ప్రకారం ఈ ఆకులను మేకలు తినడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగింది.

Also Read: గ్రూప్-1 పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది, రద్దు చేయాలి- పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైవేలో ఉన్న మొక్కలు పొల్యూషన్ తగ్గిస్తున్నాయి. వాహనాలు వదిలే ప్రమాదకరమైన వాయువులను పీల్చుకోవడంలో కోనో కార్పస్ ఉపయోగపడుతుంది. బయో రెమిడిషన్ కోసం ఈ మొక్కలు ఉపయోగపడతాయి. ఈ ఆకుల ఉపయోగం వల్ల డయాబెటిక్ తగ్గుతుంది. అల్జీమర్స్ నివారణ కోసం పనికొస్తుంది. ఈ మొక్క ఆకులతో చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి.

మిగతా చెట్ల లానే కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుంది. ఈ చెట్లు ఇతర చెట్ల పెరుగుదలను డామినేట్ చేస్తాయి. చాలా చెట్ల లానే ఈ చెట్టు వల్ల కొంత ఆస్తమా వచ్చే అవకాశం ఉంది” అని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు అన్నారు.

Also Read : భూభారతి రూల్స్ ఇవే.. మీ భూ రికార్డుల్లో తప్పులుంటే ఏం చేయాలి..? పూర్తి వివరాలు ఇలా..

అంతేకాదు కోనోకార్పస్‌ చెట్లపై వస్తున్న అపోహలను నమ్మొద్దని మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. అవి బహుజన ప్రయోజనకారిగా నిలుస్తాయని వివరించారు. ప్రకృతిలో ఉన్న ఏ వృక్షం, జీవజాలం చెడు చేయవని ఆయన స్పష్టం చేశారు. కోనోకార్పస్‌ వృక్షాల వేర్లు విస్తరించి పైపులైన్లు, గోడలను దెబ్బతీస్తాయని.. విష వాయువులను విడుదల చేస్తాయని పలు అపోహలు ఉన్నాయన్నారు. ఏ చెట్ల వేర్లయినా విస్తరిస్తే అలాంటి ఫలితాలే ఉంటాయని వివరించారు.

కోనోకార్పస్‌ చెట్లతో బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధన పత్రాలు పేర్కొన్నాయని మోహన్‌ రావు చెప్పారు. ఈ చెట్లు జంతువులకు మేలు చేస్తుందని, హైవేలపై విషపూరితమైన వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని వెల్లడించారు. ఈ చెట్ల ద్వారా సమకూరే నూనె సైతం ఔషధపరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారాయన. ఈ నూనె యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుందని, మధుమేహం వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు తగ్గిస్తుందని చెప్పారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here