Minister KTR : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : మంత్రి కేటీఆర్

రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని రక్షణ మంత్రికి చెప్పామని తలిపారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లకు ప్లాన్ చేశామని... వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయని చెప్పారు.

KTR

Central Government : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వమే చెపుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి చేయూత, మద్దతు ఇవ్వాలని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను ఇప్పటికి 15-20 సార్లు కలిశామని చెప్పారు. హైదరాబాద్.. ప్రపంచంలోనే శరణ వేగంగా విస్తరిస్తున్న నగరమని పేర్కొన్నారు. దేశంలో 44% ఉద్యోగాలు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తున్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా మారిందన్నారు.

ఫార్మా బయోటెక్ ఐటీ ఏరోస్పేస్ రంగాల్లో శరవేగమైన అభివృద్ధి హైదరాబాదులో కొనసాగుతోందని చెప్పారు. అందుకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ప్రధాని, ఐదుగురు రక్షణ మంత్రులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశామని తెలిపారు. స్కై కారిడార్ల నిర్మాణానికి సహకారం అందించాలని ఈరోజు శుక్రవారం కూడా కోరామని వెల్లడించారు. స్కై వే ప్రాజెక్టులు మంజూరు చేయడానికి రక్షణ శాఖ వద్ద ఉన్న భూములు ఇవ్వడానికి ఇప్పటికి మనసు రావడం లేదన్నారు.

Gutta Sukhender Reddy : మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం : గుత్తా సుఖేందర్ రెడ్డి

రక్షణ భూములకు రాష్ట్ర ప్రభుత్వ భూములు ఇస్తామని ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. రాజీవ్ రహదారి విస్తరణకు, అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరామని వెల్లడించారు. గత లోక్ సభలో ప్రస్తుత లోక్ సభలో పార్టీ ఎంపీలు అనేక సందర్భాల్లో లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. 56 ఎకరాల రక్షణ స్థలాన్ని ఇస్తే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్థలం ఇస్తుందని ప్రతిపాదించామని పేర్కొన్నారు.

రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని రక్షణ మంత్రికి చెప్పామని తలిపారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లకు ప్లాన్ చేశామని… వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయని చెప్పారు. వాటిని ఇవ్వాలని కోరగా, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రక్షణ శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములు ప్రజా అవసరాలకు ఇవ్వాలని కోరామని.. రేపు(శనివారం) హరిదీప్ సింగ్ ని కలుస్తామని చెప్పారు. మెట్రో రెండో దశకు, ఎయిర్ పోర్ట్ అనుసంధాన మెట్రోపై చర్చిస్తామని తెలిపారు.

Southwest Monsoon : ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో 35 అండర్ పాస్ లు, ఫ్లైవోవర్ వంతెనలు పూర్తి చేసామని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి సమయం కోరామని తెలిపారు. రసూల్ పుర జుంక్షన్ లో ఉన్న భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నామని వెల్లడించారు. పఠాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో ప్రతిపాదనకు అనుమతివ్వాలని కోరుతున్నామని తెలిపారు. 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పుడు ఏదైనా చేస్తారో లేదో చూడాలని.. చేయని పక్షంలో ప్రజల ముందు నిలబెడతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు