Chicken Shops Closed : తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపులు బంద్.. స్నేహా అవుట్లెట్ల వద్ద ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
Chicken Shops Closed : తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి చికెన్ షాపులు మూత పడనున్నాయి.
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 09:39 AM IST
chicken Shops closed from april 1 in hyderabad due to traders launch indefinite strike from april 1 over reduced margins
- తెలంగాణలో నేటి నుంచి చికెన్ షాపుల బంద్
- నగరంలో తెరుచుకొని చికెన్ సెంటర్లు
- స్నేహ అవుట్లెట్ల వద్ద నిరసన
Chicken Shops Closed : ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో పౌల్ట్రీ కంపెనీలు వర్సెస్ చికెన్ షాపులుగా ఆందోళన కొనసాగుతోంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని.. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నేటి నుంచి హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా చికెన్ షాపులు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
పౌల్ట్రీ కంపెనీలు.. 26 రూపాయలు ఉన్న మార్జిన్‌ను 10 రూపాయలు తగ్గించాయని చికెన్ షాపుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తగ్గించిన మార్జిన్‌ను పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధిక బంద్ చేయాలని పిలుపునిచ్చాయి. తమ బాధను అర్థం చేసుకుని.. చికెన్ ప్రియులు సహకరించాలని చికెన్ షాపుల యాజమాన్యాలు కోరుతున్నాయి.
ఓ వైపు చికెన్ షాపులు బంద్ చేయాలంటూ పిలుపునివ్వగా.. అందుకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో.. స్నేహ పౌల్ట్రీ అవుట్‌లెట్లు తెరిచి ఉంచారు. దీంతో ఇతర చికెన్ షాప్ యాజమాన్యాలు స్నేహ అవుట్లెట్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్నేహ అవుట్‌లెట్స్ చికెన్ షాప్ బంద్ చేయాలంటూ చికెన్ షాప్ యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చికెన్ వ్యాపారులు బంద్ బాటలో నడుస్తుండటంతో.. రానున్న రోజుల్లో చికెన్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇకనైనా కంపెనీల మొండివైఖరిని వీడి.. చిన్న వ్యాపారులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
