Child died : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రి పాల్జేసింది. మర్లకుంట తండాకు చెందిన రమావత్ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్ద నీళ్లు తాగారు. అవి కలుషిత నీళ్లు కావడంతో కుటుంబ సభ్యులందరూ అస్వస్థలకు గురయ్యారు.
9 సంవత్సరాల శ్రీనిధి అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. మొత్తం 11 మందిలో ఒకరు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో 10 నెలల బాలుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.