CJI NV Ramana Ramineni Foundation : తెలుగు వాడు తయారు చేసిన వ్యాక్సిన్ పై ఎన్నో కుట్రలు జరిగాయి – సీజేఐ ఎన్వీ రమణ

తెలుగు వాడు అంటే చిన్న చూపు మనస్తత్వం పోవాలని ఎన్వీ రమణ అన్నారు. మన వాళ్లు ఎక్కడున్నా గౌరవించుకోవాలన్నారు. భారత్ బయోటెక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని..

Cji Nv Ramana Ramineni Foundation

CJI NV Ramana Ramineni Foundation : రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2020, 2021 ఏడాదికి విశిష్ట, విశేష పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గతేడాది కరోనా వల్ల అవార్డుల కార్యక్రమం రద్దు కాగా, రెండు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.

2021 సంవత్సరానికి గాను భారత్​ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల విశిష్ట పురస్కారం అందుకున్నారు. అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్‌ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్‌ ఎస్‌వీ రామారావులు విశేష పురస్కారాలు అందుకున్నారు.

January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..

2020 సంవత్సరానికి గాను నాబార్డ్‌ చైర్మన్ డా.జి.ఆర్.చింతల, యాంకర్ సుమ కనకాల, హీలింగ్ హస్త హెర్బల్స్ సంస్థ ఎండీ మస్తాన్‌, షిర్డీలోని ద్వారకామాయి సేవా ట్రస్ట్‌కు చెందిన శ్రీనివాస్‌ విశేష పురస్కారాలు అందుకున్నారు.

ఈ పురస్కారాలను ఎన్వీ రణమ చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగు వాడు అంటే చిన్న చూపు మనస్తత్వం పోవాలని ఎన్వీ రమణ అన్నారు. మన వాళ్లు ఎక్కడున్నా గౌరవించుకోవాలన్నారు. భారత్ బయోటెక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎన్వీ రమణ అన్నారు. తెలుగు వాడు తయారు చేసిన వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుట్రలు జరిగాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ల కృషి గుర్తించాలని సీజేఐ అన్నారు.

Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ పురస్కారాలను అందజేశారు. హైదరాబాద్ లోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ రామినేని ధర్మప్రచారక్‌ చెప్పారు.