Bhatti Vikramarka: స్వాతంత్య్రం భిక్ష అన్నవాళ్లే దేశద్రోహులు.. కంగనా కామెంట్స్‌పై కాంగ్రెస్ సీరియస్!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో మాట్లాడారు. స్వాతంత్య్రాన్ని భిక్షతో పోల్చిన కొందరి కామెంట్లను తప్పుబట్టారు. అలా మాట్లాడిన వాళ్లే దేశద్రోహులని తీవ్రంగా విమర్శించారు.

Bhatti

Bhatti: దేశానికి అసలైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని.. 1947లో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష అని.. నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. కుటుంబాలను వదులుకుని.. ప్రాణాలను ఫణంగా పెట్టి.. సమరయోధులు సాధించిపెట్టిన స్వాతంత్య్రాన్ని భిక్షగా చెప్పేవాళ్లను దేశద్రోహులుగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.

దేశాన్ని ప్రేమించే ప్రతిఒక్కరూ.. ఇవాళ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళి అర్పించాలని చెప్పారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ వదులుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు నెహ్రూ వేసిన పునాదులే.. నేడు ఇంతటి బలమైన దేశంగా ఎదిగేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు దించేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమిపై.. పార్టీలో అర్థవంతమైన చర్చ జరిగిందని చెప్పిన భట్టి.. ఈ విషయంపై మీడియాలో వచ్చిన ఏ వార్త కూడా నిజం కాదని స్పష్టం చేశారు. పార్టీ నేతల మధ్య వాగ్వాదం అంటూ మీడియాలో వచ్చిన వార్తలను.. ఇన్ డైరెక్ట్ గా కొట్టి పడేశారు. రివ్యూ సమావేశం తర్వాత.. తాము చెప్పిన విషయాలు మాత్రమే వాస్తవాలను చెప్పారు… భట్టి.

Read More:

Kangana Ranaut : 1947లో స్వాతంత్ర్యం..భిక్ష : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Kangana Ranaut : నా ప్రశ్నలకు సమాధానమిస్తే.. ‘పద్మ శ్రీ’ తిరిగి ఇచ్చేస్తా: కంగనా రనౌత్

హుజూరాబాద్ ఉపఎన్నిక : కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

Ponnam Prabhakar : హుజూరాబాద్‌లో ఓటమిపై కాంగ్రెస్ రివ్యూ చేయడం పట్ల పొన్నం ప్రభాకర్ సీరియస్