Kangana Ranaut : 1947లో స్వాతంత్ర్యం..భిక్ష : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌.. కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ మరో వివాదానికి తెరలేపింది. దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన కేసిన కామెంట్స్ కాంట్రావర్సీకి కారణమయ్యాయి.

Kangana Ranaut : 1947లో స్వాతంత్ర్యం..భిక్ష : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Kangana

Freedom In 1947 : బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌.. కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ మరో వివాదానికి తెరలేపింది. నిత్యం వివాదాస్పద ట్వీట్లతో ఓవరాక్షన్ చేసే కంగనా.. తాజాగా.. దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన కేసిన కామెంట్స్ కాంట్రావర్సీకి కారణమయ్యాయి. భారత్‌తో 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని.. 1947లో లభించింది భిక్ష అని.. అలాంటి దాన్ని అజాదీగా పరిగణిస్తామా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవలే పద్మ పురస్కారం అందుకున్న కంగనా.. ఓ కాంక్లేవ్‌లో పాల్గొన్న సమయంలో.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read More : Holidays: రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

దీంతో కంగనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సార్లు మ‌హాత్మాగాంధీ త్యాగాలు, ఆయ‌న చేసిన దీక్షల‌ను అవ‌మానిస్తారు. మ‌రికొన్నిసార్లు ఆయ‌న్ను హ‌త్య చేసిన‌వారిని పొగుడుతారు. ఇప్పుడు మంగ‌ళ్ పాండే నుంచి మొద‌లుకుని సుభాష్ చంద్రబోస్, భ‌గ‌త్ సింగ్, చంద్రశేఖ‌ర్ ఆజాద్, రాణీ ల‌క్ష్మీభాయి వంటి ఎంతో మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను అవ‌మానిస్తున్నారు అంటూ మండిప‌డ్డారు.

Read More : Visakha : స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక..గేట్ల దిగ్భందానికి పిలుపు

కంగనా కామెంట్స్‌పై ఓరేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రీతి మీన‌న్ ముంబ‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కంగనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కంగన సపోర్ట్ చేస్తున్న బీజేపీనుంచే అమెపై విమర్శలు వస్తున్నాయి.  కంగన కామెంట్స్‌కు సంబంధించి వీడియోను షేర్ చేసిన వరుణ్ గాంధీ.. ఆమె ఆలోచనను పిచ్చితనంగా భావించాలా.. లేక దేశద్రోహంగా పరిగణించాలా అని ప్రశ్నించారు. ఇక కంగన కామెంట్స్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించినందుకు ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని… ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.