Revanth Reddy: సీఎం రేవంత్ మాటల వెనుక మర్మమేంటి? రేవంత్‌ది ఆత్మవిశ్వాసమా.? మైండ్ గేమ్ ఆడుతున్నారా.?
గత చరిత్రను ప్రజల ముందు పెట్టడం ద్వారా..మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందా అనే చర్చను తీసుకురావాలనేది రేవంత్ ప్లాన్ అని అంటున్నారు.

Cm Revanth Reddy
Revanth Reddy: సభ ఏదైనా..మీటింగ్ మరేదైనా..అది ప్రెస్‌మీట్..అయినా అధికారులతో రివ్యూ అయినా..మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా సీఎం రేవంత్ ప్రసంగం ముగియడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ ఐదేళ్లే కాదు..రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం. తానే సీఎంగా ఉంటానంటున్నారు.
దానికో సెంటిమెంట్‌ను..గత ట్రాక్ రికార్డును ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పదేళ్లు పాలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు టర్మ్‌లు పవర్‌లో ఉంటుంది. తానే సీఎంగా ఉంటానంటూ చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కేవలం సెంటిమెంట్ బేస్‌గానే చూడాలా లేక జనం మూడ్‌ను తమవైపుకు తిప్పుకునేలా స్కెచ్ వేస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: Asia Cup 2025: 7 మ్యాచుల్లో జస్ట్ 67 రన్స్.. కట్ చేస్తే ఆసియా కప్‌లో చోటు.. ఏం లక్ గురూ నీది..?
గత చరిత్రను ప్రజల ముందు పెట్టడం ద్వారా..మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందా అనే చర్చకు తీసుకురావాలనేది రేవంత్ ప్లాన్ అని అంటున్నారు. దాంతో ప్రభుత్వ ఫెయిల్యూర్స్..అపోజిషన్ విమర్శలు ఇవన్నింటి కంటే..తానే మళ్లీ సీఎం అవుతానన్న టాక్ జనాల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారట.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పవర్‌లోకి రాబోతుందన్న ప్రచారంతోనే న్యూట్రల్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లారన్న చర్చ ఉంది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇదే తరహాలో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేది మళ్ళీ బీఆర్ఎస్సేనని అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందింది.
వచ్చే ఎన్నికల్లో ఇంకాస్త టఫ్ ఫైట్
మరో 10 నుంచి 15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇంకాస్త టఫ్ ఫైట్ ఉంటుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అయితే వచ్చే ఎన్నికల నాటికి గులాబీ బాస్ కేసీఆర్ అంత యాక్టీవ్‌గా ఉండకపోవచ్చని భావిస్తున్నారట రేవంత్.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముక గాయంతో కేసీఆర్ చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వయసురిత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఎక్కువగా రెస్ట్‌లోనే ఉంటున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ అంత యాక్టీవ్‌గా ఉండకపోవచ్చని సన్నిహితులతో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారట. కేసీఆర్ బరిలో లేకుంటే.. కేటీఆర్‌ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది రేవంత్ అంచనా అంటున్నారు.
కేసీఆర్ యాక్టీవ్‌గా లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలువగలమనే లెక్కతోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి సన్నిహితులతో దగ్గర ప్రస్తావించడమే కాదు..పబ్లిక్ మీటింగ్‌లలోనూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు 90 నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఎన్నికల ప్రచారం చేశారు. (Revanth Reddy)
ఇప్పుడు ఆయన అనారోగ్యం దృష్ట్యా వచ్చే ఎన్నికల నాటికి అంతే యాక్టీవ్‌గా పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొనకపోవచ్చని అంచనా వేస్తున్నారట. ఇక కేటీఆర్, హరీశ్‌రావును ఇద్దరిని వారి నియోజకవర్గాల్లోనే టైట్ చేస్తే..కాంగ్రెస్ గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట సీఎం రేవంత్. ఏదైనా తన బలం కంటే ప్రత్యర్థి వీక్‌నెస్‌ను నమ్ముకుని రేవంత్ రాజకీయం చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారిందంటున్నారు. కేసీఆర్ యాక్టీవ్‌గా లేకపోతే తనదే గెలుపనే రేవంత్ లెక్క తప్పుతుందా.? పక్కాగా వర్కవుట్ అవుతుందా.? అనేది కాలమే నిర్ణయించాలి.