Asia Cup 2025: 7 మ్యాచుల్లో జస్ట్ 67 రన్స్.. కట్ చేస్తే ఆసియా కప్‌లో చోటు.. ఏం లక్ గురూ నీది..?
ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్‌లో అతని ఆటతీరు దారుణం. 28 రన్స్ మాత్రమే చేశాడు, సగటు 9.33, స్ట్రైక్‌రేట్ కేవలం 82.35.

Asia Cup 2025
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో రింకూ సింగ్‌కు అవకాశం దక్కింది. అయితే, ఫినిషర్‌గా రింకూసింగ్ రాణిస్తాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్నింగ్స్ చివరలో జట్టును గెలిపించే బాధ్యతను తీసుకునే సమర్థత ఈ బ్యాటర్‌కు ఉందా? అంటూ పలు రకాలుగా విశ్లేషణలు వస్తున్నాయి. అతడు ఆడిన చివరి 7 మ్యాచుల్లో జస్ట్ 67 రన్స్ మాత్రమే చేశాడు.
రింకూ ఎలా ఆడుతున్నాడు?
టీ20 ఫార్మాట్‌లో రింకూ ఆటతీరు ఎలా ఉందో చూద్దాం.. 2023లో కొల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడి 474 రన్స్ చేశాడు ఈ యంగ్ బ్యాటర్. ఆ సమయంలో బాగా మెరిశాడు, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడని అందరూ కొనియాడారు.
అదే ఏడాది ఐర్లాండ్ టూర్‌కు ఇండియా కాల్ అప్ సాధించాడు. అతడు జాతీయ జట్టులో దీర్ఘకాలికంగా ఆడతాడనే నమ్మకం అందరిలోనూ పెరిగింది. అయితే, ఆ తర్వాత ఆ నమ్మకం మెల్లిగా సన్నగిల్లుతూ వచ్చింది. 2024, 2025 ఐపీఎల్ మ్యాచుల్లో అనుకున్నంతగా రాణించలేదు. అలాగే, 2024 టీ20 వరల్డ్ కప్‌కు అతడిని కేవలం ట్రావెలింగ్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపిక చేశారు.
అప్పట్లో అది అన్యాయమని కొందరు అన్నారు. అలాగే, ఒక్కో మెట్టు వెక్కుతూ పైకి వెళ్లాల్సిన సమయంలో రింకు గ్రాఫ్ కిందకు జారింది. కొంత కాలంగా అతగు రాణించడం లేదు. (Asia Cup 2025)
మొదట రింకూ రింగ్స్ ఆడిన తీరు, కొంత కాలంగా ఆడుతున్న తీరు ఎలా ఉందో చూద్దాం.. బంగ్లాదేశ్ సిరీస్ వరకు రింకు గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 19 ఇన్నింగ్స్‌లలో 479 రన్స్, సగటు 59.87, స్ట్రైక్‌రేట్ 175.45, 3 ఫిఫ్టీలు ఉన్నాయి. ఆ సమయంలో అతడు స్టార్ ఆటగాడిలా కనపడ్డాడు.
కానీ దాని తర్వాత అతడు ఆటలో ఆ రిథమ్‌ను తిరిగి పొందలేకపోయాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి రెండు టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 7 మ్యాచ్‌లలో అతను కేవలం 67 రన్స్ మాత్రమే చేశాడు, సగటు 13.40, స్ట్రైక్‌రేట్ 101.51కి పడిపోయింది. ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్‌లో అతని ఆటతీరు దారుణం. 28 రన్స్ మాత్రమే చేశాడు, సగటు 9.33, స్ట్రైక్‌రేట్ కేవలం 82.35.
సంవత్సరం | మ్యాచ్‌లు | రన్స్ | సగటు | హయ్యెస్ట్ స్కోర్ |
---|---|---|---|---|
2025 | 13 | 206 | 29.42 | 38* |
2024 | 15 | 168 | 18.66 | 26 |
2023 | 14 | 474 | 59.25 | 67* |
2022 | 7 | 174 | 34.80 | 42* |