CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్

న్యాయవాదిగా, ఐఏఎస్ గా సేవలు అందించిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. అటువంటి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు,

cm kcr grand welcome to yashwant sinha : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు CM కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ తో పాటు యశ్వంత్ సిన్హాకు మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు.  అనంతరం భారీ ర్యాలీతో జలవిహార్ కు చేరుకున్నారు.

జలవిహార్ లో సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సిన్హా పరిచయం చేశారు సీఎం కేసీఆర్. అనంతరం సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..తెలంగాణ ప్రజల తరపున యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలుకుతున్నానని..న్యాయవాదిగా, ఐఏఎస్ గా సేవలు అందించిన యశ్వంత్ సిన్హా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారని తెలిపారు. ఆర్థిక వ్యవహారాలను శాఖను సమర్థవంతంగా నిర్వహించిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని తెలిపారు. అటువంటి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నానని కేసీఆర్ తెలిపారు.

భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా గొప్ప వ్యక్తి అని కొనియాడారు కేసీఆర్. లాయర్ గా కెరీర్ ప్రారంభించి..ఆర్థిక మంత్రి స్థాయికి ఎదిగిన ఆయనకు అన్ని రంగాల్లోను మంచి అనుభవం ఉంది అని అటువంటి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేశంలోని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ వేదిక నుంచి దేశంలోని ఎంపీలకు నా విజ్ఞప్తి ఏమంటే..ఎంపీలు అందరూ ఆత్మప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు చేసి రాష్ట్రపతిగా గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు. ఇంతకు ముందు కూడా వివి గిరిని ఇలాగే ఆత్మప్రభోదానుసారం రాష్ట్రపతిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.


								

ట్రెండింగ్ వార్తలు