CM KCR National Party: తెలంగాణ భవన్‌ వద్ద సందడి.. కుమారస్వామితో కలిసి చేరుకున్న కేసీఆర్

తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది.

CM KCR National Party: తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్ కు బయలుదేరే ముందు దసరా సందర్భంగా ప్రగతి భవన్ లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగే సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు హాజరు కానున్నారు.

తెలంగాణ భవన్‌ పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయంగా మారాయి. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ టీఆర్ఎస్ మారుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. హైదరాబాద్ లోనే కాకుండా పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు ఇవాళ మధ్యాహ్నం నుంచి సంబరాలు చేసుకోనున్నారు. అన్ని టీఆర్ఎస్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో గులాబీ పోస్టర్లు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు కనపడుతున్నాయి.

తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగాగాలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకోనున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

 

ట్రెండింగ్ వార్తలు