CM KCR : జూడాల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

Cm Kcr Orders To Solve Junior Doctors Problems

Junior Doctors Strike : కరోనా వేళ జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ర్ట వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు.

దీనిపై వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని…తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. జూనియర్ డాక్టర్లపై ఏనాడు ప్రభుత్వం వివక్ష చూపలేదన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తూనే ఉందని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సందర్భంగా వారి సమస్యలపై ఆరా తీశారు. తక్షణమే జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్య సేవల్లో కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా…సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం అందించాలని సూచించారు. జుడాలు, వారి కుటుంబీలకు నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. నిబంధనల మేరకు ఎక్స్ గ్రేషియా కూడ సత్వరమే అందించాలన్నారు.

Read More :