సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. రేపు ఢిల్లీకి వెళ్తున్నా..
వరి ధాన్యం కొనుగోళ్ల మీదు జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిమార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు.. పలుకు లేదని విమర్శించారు.
- Sreehari A
- Published On : November 20, 2021 / 07:05 PM IST
Cm Kcr Press Meet Over Repeal Farm Laws
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసేందే. ధాన్యం కొనుగోళ్ల అంశంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
