CM KCR To Address On Dharani Portal : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామం…మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్..ఈ గ్రామం నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభ నుంచి..రాష్ట్ర ప్రజలకు ధరణి సందేశం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.
ప్రారంభోత్సం సందర్భంగా మూడుచింతలపల్లి గ్రామంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్ పర్యటించే ఎమ్మార్వో కార్యాలయం వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభోత్సం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసగించే సభావేదికను మంత్రులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
https://10tv.in/everything-online-dharani-portal-launch/
భూమి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కొత్త చట్టం ఉంటుందని మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాత వ్యవస్థతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని..కొత్త రెవెన్యూ చట్టం ద్వారా సమస్యలు తీరితే అంతకుమించి అదృష్టం ఉండదని అంటున్నారు.
మొత్తంగా ఇటు…మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు…రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధరణి వెబ్‌సైట్ మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానుంది.