Telangana New CM: సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఢిల్లీలో సీఎం అభ్యర్థిని ఫైనల్ చేశాకే ప్రమాణ స్వీకారం సమయంపై క్లారిటీ రానుంది.

తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఈ విషయమై రాజ్ భవన్ లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఢిల్లీలో సీఎం అభ్యర్థిని ఫైనల్ చేశాకే ప్రమాణ స్వీకారం సమయంపై క్లారిటీ రానుంది.

సీఎం నిర్ణయం పూర్తిగా అధిష్టానానిదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేవంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని చెప్పినప్పటికీ, అది జరగలేదు. దీంతో తెలంగాణ పరిశీలకులు సహా ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. వీరు ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం రేపు తెలంగాణ పరిశీలకులతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతారు. తెలంగాణలో సీఎల్పీ నేత ఎంపికపై ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, దీపా దాస్ మున్షి, డా.అజయ్ కుమార్, కె మురళిధరన్,కేజె జార్జ్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సీఎల్పీ నేత ఎంపిక ఆలస్యం

హై కమాండ్ ఏం చెప్పినా తమకు ఓకే అని సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు ఏక వాఖ్య తీర్మానం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎమ్మెల్యేల నుంచి వన్ టూ వన్ అభిప్రాయాలను తీసుకోమని ఏఐసీసీ ఆదేశించింది. పార్లమెంట్ వారీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తీసుకున్నారు. అభిప్రాయాలను మినిట్స్ రూపంలో ఏఐసీసీ పరిశీలకులు రికార్డ్ చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని డీకే ఢిల్లీకి వెళ్లారు.

ఖర్గేదే నిర్ణయం.. తెలంగాణ సీఎంపై మాణిక్యం ఠాకూర్
తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేదే తుది నిర్ణయమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఉందని, సరైన వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. కాగా, ఖర్గేకు ఎమ్మెల్యేల నిర్ణయానికి సంబంధించిన రిపోర్టును ఇచ్చారు. ఇక రేపు పరిశీలకులు ఇచ్చిన రిపోర్టు అనంతరం ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు